NTV Telugu Site icon

Sabarimala Darshan: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. పంబ వరకు క్యూ లైన్లు

Ayyappa

Ayyappa

Sabarimala Darshan: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు పెద్దఎత్తున్న చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శబరిమల చేరిన భక్తులతో, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీనితో భక్తులు క్యూ లైన్లలలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలపాటు సమయం పడుతున్నట్లు సమాచారం. పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. అయితే, రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్‌ దర్శనం కల్పించనున్నారు. అలాగే మరిన్ని దర్శనాలను సౌకర్యవంతంగా చేయడానికి ట్రావెన్‌ కోర్ దేవస్థానం ఆన్‌లైన్ దర్శనాలపై నియంత్రణ విధించింది.

Also Read: Rythu Bharosa: రైతు భరోసా నిబంధనలు ఇవే.. వారికి నిరాశే..

అలాగే సోమవారం నుంచి ఆన్‌లైన్ దర్శనాలకు పరిమితి విధించనున్నారు. 13వ తేదీన 50 వేల మందికి, 14వ తేదీన 40 వేల మందికి దర్శనం ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. 15వ తేదీకి 60 వేల మందికి ఆన్‌లైన్ దర్శన సేవలు అందించే ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ట్రావెన్‌ కోర్ దేవస్థానం అధికారులు శబరిమలలో భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 14వ తేదీన మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులకు సరైన వసతులు కల్పించడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నారు.

Show comments