NTV Telugu Site icon

Vijayawada: హెడ్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. ఇంట్లోనే మసాజ్ సెంటర్

Vijayawada: పోలీసులంటే ప్రజల్లో అంతులేని గౌరవం ఉంది. కానీ కొందరి వల్ల డిపార్ట్ మెంట్ పరువు గంగలో కలిసిపోతుంది. కాసులకు కక్కుర్తిపడి కొందరు ఖాకీ చొక్కాకు తలొంపులు తెస్తున్నారు. అలాంటి హెడ్ కానిస్టేబుల్ చేసిన పనికి ఇప్పుడు డిపార్ట్ మెంట్ తలదించుకునే పరిస్థితి తలెత్తింది. ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఇంట్లో.. గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఏపీలోని విజయవాడ నగరంలో చోటు చేసుకుంది. పెనుమలూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ పోలీసు ఉద్యోగి ఇంట్లో ఈ తతంగం అంతా జరుగుతుందన్న వార్త తెలిసి స్థానికులు నోళ్లు వెల్లబెట్టారు.

Read Also:CPI Narayana: మోడీ అసలైన ఆర్ధిక నేరస్తుడు : సీపీఐ నారాయణ

వివరాల్లోకి వెళితే.. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని మసాజ్ కేంద్రాలపై పోలీసులు శనివారం మెరుపు దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో పెనమలూరు పీఎస్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ నడుపుతున్నట్లుగా తేలింది. ఈ మెరుపు దాడుల్లో 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాడిగడప వంద అడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలోని ఒక ఇంట్లో ఒక మసాజ్ కేంద్రం, పోరంకిలో ఒక మసాజ్ కేంద్రాలలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది.

Read Also:BRO: నిన్న మామ.. నేడు అల్లుడు.. ఈ స్పీడ్ మాములుగా లేదు ‘బ్రో’

అయితే ఇందులో ఓ మసాజ్ కేంద్రం నడుస్తున్న ఇల్లు హెడ్ కానిస్టేబుల్ కిషోర్‎దని తేలింది. ఆయన పెనుమాలూరు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతుందన్న ఆరోపణలు రావడంతో.. పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కేంద్రాల మీద నిగా పెట్టిన పోలీసులు 12 మంది మహిళలు ఏడుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లోనే హెడ్ కానిస్టేబుల్ మీద ఆరోపణలు రావడంతో ఎస్పీ జాషువా అతని మీద విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Show comments