Vijayawada: హెడ్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. ఇంట్లోనే మసాజ్ సెంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: పోలీసులంటే ప్రజల్లో అంతులేని గౌరవం ఉంది. కానీ కొందరి వల్ల డిపార్ట్ మెంట్ పరువు గంగలో కలిసిపోతుంది. కాసులకు కక్కుర్తిపడి కొందరు ఖాకీ చొక్కాకు తలొంపులు తెస్తున్నారు. అలాంటి హెడ్ కానిస్టేబుల్ చేసిన పనికి ఇప్పుడు డిపార్ట్ మెంట్ తలదించుకునే పరిస్థితి తలెత్తింది. ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఇంట్లో.. గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఏపీలోని విజయవాడ నగరంలో చోటు చేసుకుంది. పెనుమలూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ పోలీసు ఉద్యోగి ఇంట్లో ఈ తతంగం అంతా జరుగుతుందన్న వార్త తెలిసి స్థానికులు నోళ్లు వెల్లబెట్టారు.
Read Also:CPI Narayana: మోడీ అసలైన ఆర్ధిక నేరస్తుడు : సీపీఐ నారాయణ
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
వివరాల్లోకి వెళితే.. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని మసాజ్ కేంద్రాలపై పోలీసులు శనివారం మెరుపు దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో పెనమలూరు పీఎస్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ నడుపుతున్నట్లుగా తేలింది. ఈ మెరుపు దాడుల్లో 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాడిగడప వంద అడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలోని ఒక ఇంట్లో ఒక మసాజ్ కేంద్రం, పోరంకిలో ఒక మసాజ్ కేంద్రాలలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది.
Read Also:BRO: నిన్న మామ.. నేడు అల్లుడు.. ఈ స్పీడ్ మాములుగా లేదు ‘బ్రో’
అయితే ఇందులో ఓ మసాజ్ కేంద్రం నడుస్తున్న ఇల్లు హెడ్ కానిస్టేబుల్ కిషోర్దని తేలింది. ఆయన పెనుమాలూరు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతుందన్న ఆరోపణలు రావడంతో.. పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కేంద్రాల మీద నిగా పెట్టిన పోలీసులు 12 మంది మహిళలు ఏడుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లోనే హెడ్ కానిస్టేబుల్ మీద ఆరోపణలు రావడంతో ఎస్పీ జాషువా అతని మీద విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!