Volunteers Resign: మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Volunteers Resign: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సోమవారం మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు. గ్రామ సచివాలయాల్లోనూ రాజీనామాలు సమర్పించారు వాలంటీర్లు.
Read Also: Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. తెలంగాణలో ఎల్లో అలర్ట్
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
మచిలీపట్నం నియోజకవర్గంలో 1200 మందికి పైగా వాలంటీర్లు ప్రజలకు సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్నామని, ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు వాపోతున్నారు. గత 50 నెలలుగా నిస్వార్థంగా సేవలందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి రాజకీయాలకు ప్రభావితం కాకుండా విధులు నిర్వహిస్తున్నామని అంటున్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలచివేసిందని తెలిపారు. తమ దగ్గర్నుంచి మొబైల్ సిమ్స్, డివైస్‌లు తీసేసుకున్నారని చెప్పారు. కొంత మంది తమ సేవలకు రాజకీయాలను ఆపాదించి ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు వాలంటీర్లు. దీంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!