తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘మసూద’ చిత్రం హారర్ ప్రియులను ఎంతగా భయపెట్టిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆత్మ ఆవహించిన ‘నాజియా’ పాత్రలో నటించి, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను వణికించిన బాంధవి శ్రీధర్ గుర్తుంది కదా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రామయ్య వస్తావయ్య’ వంటి సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ హైదరాబాద్ అమ్మాయి, ‘మసూద’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే, ఆ సినిమాలో భయపెట్టిన అమ్మాయేనా ఈమె అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర బ్లాక్ డ్రెస్సులో అదిరిపోయే పోజులిస్తూ, హీరోయిన్ మెటీరియల్‌లా మెరిసిపోతోంది బాంధవి.
Also Read : MSVP : మన శంకర వరప్రసాద్ గారు’..చిరు, వెంకీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ప్రస్తుతం బాంధవి శ్రీధర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫిట్‌నెస్ మరియు గ్లామర్ ఫోటోలతో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. జిమ్ సెల్ఫీలతో పాటు లేటెస్ట్ ఫోటోషూట్‌లతో కుర్రకారును మాయ చేస్తోంది. 2024లో ‘లైట్ హౌస్’, అలాగే ఈ ఏడాది (2025)లో విడుదలైన ‘జాట్’ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి తనలోని యాక్షన్ కోణాన్ని కూడా చూపించింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్‌గా వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. తన అందం మరియు నటనతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న బాంధవికి హీరోయిన్‌గా ఎలాంటి భారీ అవకాశం వస్తుందో చూడాలి.