Manipur Violence: మణిపూర్‌లో చెలరేగిన హింస ఇప్పటికీ ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు బాక్సింగ్ స్టార్ ఎంసీ మేరీకోమ్ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మణిపూర్‌లోని కోమ్ గ్రామాల్లోకి చొరబడుతున్న రెండు గ్రూపులను భద్రతా బలగాలు నిరోధించేలా జోక్యం చేసుకోవాలని మేరీ కోమ్ కోరింది. కోమ్ కమ్యూనిటీ అనేది మణిపూర్‌లోని ఆదివాసీ తెగ అని, ఇది మైనారిటీలలో అతి చిన్నదని, అందుకే అది ఏ శక్తివంతమైన వర్గంతోనూ పోరాడలేకపోతుందని లేఖలో పేర్కొన్నారు.
Also Read: INDIA’s Big Mumbai Decisions: ముంబయిలో ఇండియా కూటమి కీలక నిర్ణయాలు..!
గురువారం అమిత్ షాకు రాసిన లేఖలో.. మణిపూర్‌లోని ఆదివాసీ తెగ అయిన కోమ్ కమ్యూనిటీ మైనారిటీలలో అతి చిన్నది అని అన్నారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మేరీ కోమ్ మాట్లాడుతూ.. మేమంతారెండు ప్రత్యర్థి వర్గాల మధ్య చెల్లాచెదురుగా ఉన్నామన్నారు. మా కమ్యూనిటీపై దాడులు జరుగుతాయనే భయాందోళనలతో ఉన్నామని, అన్ని సమస్యల మధ్య చిక్కుకున్నామన్నారు. కోమ్ కమ్యూనిటీ మైనారిటీలలో అతి చిన్నదని, అందుకే కోమ్ అధికార పరిధిలోకి చొరబడే ఏ శక్తికి వ్యతిరేకంగా తాము పోరాడలేకపోయామన్నారు.
Also Read: NEET SS exam 2023: జీ20 సమ్మిట్ కారణంగా నీట్ ఎస్‌ఎస్ పరీక్ష రీషెడ్యూల్
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మేరీకోమ్ మాట్లాడుతూ.. యుద్ధంలో ఉన్న రెండు గ్రూపులు కోమ్ గ్రామాల్లోకి చొరబడకుండా నిరోధించడానికి తాము భద్రతా దళాల సహాయాన్ని కోరుతున్నామన్నారు. భారత సైన్యం, పారామిలటరీ, రాష్ట్ర బలగాలు జనాభాను రక్షించడానికి, రాష్ట్రంలో శాంతి,సాధారణ పరిస్థితులను కొనసాగించడంలో విజయం సాధించడానికి తమ బాధ్యతలను నిర్వహించడంలో నిష్పాక్షికంగా ఉండాలని అభ్యర్థించారు.మణిపూర్‌లోని ప్రజలందరినీ, ముఖ్యంగా మైతేయి, కుకీ కమ్యూనిటీల విభేదాలను పరిష్కరించి రాష్ట్రంలో శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించాలని కోరారు. మనమందరం కలిసి జీవించాల్సిన అవసరం ఉందని, మనలోని విభేదాలు, గాయాలను పక్కనపెట్టి ఐక్యం చేద్దామని మేరీకోమ్ అన్నారు.