Mary Kom Retirement: నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు: మేరీ కోమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mary Kom React on Retirement News: భారత దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ బుధవారం జరిగిన ఓ స్కూల్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మేరీ కోమ్ ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఆమె గురువారం స్పందించారు. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తాను ఇప్పుడే బాక్సింగ్‌ను వీడబోనని, పోటీలో కొనసాగేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నట్లు మేరీ కోమ్ తెలిపారు.
బుధవారం అస్సాంలోని డిబ్రూగఢ్‌లో జరిగిన ఓ స్కూల్ ఈవెంట్‌లో మేరీ కోమ్ పాల్గొన్నారు. ‘క్రీడలలో ఇంకా ఏదో సాధించాలనే కోరిక ఉంది. కానీ నా వయసు అందుకు అడ్డంకిగా మారింది. వయోపరిమితి కారణంగా ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోతున్నా. నాకు ఇంకా ఆడాలని ఉన్నా.. బలవంతంగా వైదొలగాల్సి వస్తుంది. నా జీవితంలో నేను అన్నీ సాధించాను. ఇక రిటైర్ అవ్వాలి’ అని అన్నారు. దీంతో మేరీ కోమ్ బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వచ్చాయి.
Also Read
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- 10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- 12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
ఈ వార్తలపై మేరీ కోమ్ నేడు స్పందించారు. ‘నేను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సోషల్ మీడియా, మీడియాలో కథనాలు వచ్చాయి. అవి నిజం కాదు. నేను ఇంకా రిటైర్మెంట్ ఇవ్వలేదు. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈవెంట్‌లో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు నేను ఇలా అన్నాను. నేను ఇంకా ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతున్నా. రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి అధికారికంగా ప్రకటిస్తా’ అని మేరీ కోమ్ అన్నారు.
Also Read: Nara Lokesh: రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది: నారా లోకేశ్
2022లో కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్ సందర్భంగా మోకాలికి గాయం కావడంతో.. మేరీ కోమ్ రింగ్‌లోకి దిగలేదు. బాక్సింగ్ రూల్స్ ప్రకారం.. ఎలైట్ లెవెల్‌లో ఆడాలంటే 40 ఏళ్లే గరిష్ఠ వయో పరిమితి. ప్రస్తుతం మేరీ వయసు 41 ఏళ్లు. కాబట్టి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. మహిళా బాక్సర్లలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో మేరీ కోమ్ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. ఐదుసార్లు ఆసియా ఛాంపియన్ అయ్యారు.
తాజావార్తలు
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!