Site icon NTV Telugu

Shocking News : చనిపోయి ఆరేళ్లవుతోంది.. రెండేళ్ల కొడుకుతో ప్రత్యక్షం

Marriage

Marriage

Shocking News : బీహార్‌లోని బక్సార్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్న వేధింపుల కేసులో ఆరేళ్ల తరువాత వివాహిత సజీవంగా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అంతే కాకుండా రెండేళ్ల కొడుకుతో ప్రత్యక్షమయ్యే సరికి స్థానికులంతా అవాక్కయ్యారు. వివాహిత పేరు సికా కుమారి. ఈ కేసు సంగ్రామ్‌పూర్ ప్రాంతానికి చెందినది. 2015లో మురళి గ్రామానికి చెందిన నందకిషోర్ సాహ్నితో సికా వివాహం జరిగింది. పెళ్లయ్యాక భర్తను వదిలి ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహిత అదృశ్యమైన తర్వాత, ఆమె తండ్రి భోలా సాహ్ని.. కట్నం కోసం తన కూతుర్ని చంపారని భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read Also: Delhi Girl Murder: ఒక్క మిస్డ్ కాల్‌తో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు..

ఈ కేసులో భర్త మినహా ఇతర అత్తమామలపై ఆరోపణలు వచ్చాయి. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. కేసరియాలోని సోంరాపూర్‌కు చెందిన సికా తండ్రి భోలా సాహ్ని 2017లో సంగ్రామ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కట్నం కోసం హత్య చేసి మృతదేహాన్ని అదృశ్యం చేసినందుకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం తర్వాత భర్త నందకిషోర్ సాహ్ని ఇంటి నుంచి పారిపోయాడు. అదే సమయంలో నిందితుడి సోదరుడు, కోడలు సహా కుటుంబంలోని ఆరుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Read Also: Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో చోరీ.. బంగారు నగలతో పాటు విగ్రహాలు మాయం

మంగళవారం కొత్వాలోని జాగిరహ గ్రామంలో ఓ వివాహిత రెండేళ్ల కొడుకుతో కనిపించింది. ఈ కేసులో కోర్టు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా తెలిపారు. వివాహితను అదుపులోకి తీసుకుని, దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version