Vivah Muhurat in 2023 : హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహమనే వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన వధూవరులు ఒక్కటయ్యే వేళ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత దేశంలో పెళ్లికి సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలు పాటిస్తారు. కొన్ని చోట్ల ఐదు రోజుల పెళ్లి, మరికొన్ని చోట్ల మూడు రోజుల పెళ్లిళ్లు జరుపుకుంటారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసీ ఏకంగా పదహారు రోజుల పాటు పండుగలా పెళ్లి చేసుకుంటారు. అందుకే భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.
Read Also:Vyooham Teaser 2 : నిజం తన షూ లేస్ కట్టుకునే లోపే అబద్దం ప్రపంచమంతా ఒక రౌండ్ వేసి వస్తుంది..
ఇది ఇలా ఉంటే జ్యోతిష్యం, పంచాంగం ప్రకారం, పెళ్లి వంటి ముఖ్యమైన కార్యాలకు జాతకంలోని శుక్రుడి స్థానాన్ని కీలకంగా పరిగణిస్తారు. గత కొంత కాలంగా పెళ్లికి సంబంధించి ఎలాంటి శుభ ముహుర్తాలు లేవు. అందుకే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు ప్రతి ఒక్కరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆషాడం, అధిక శ్రావణ మాసం కారణంతో రాష్ట్రమంతా రెండు నెలల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కి చెక్ పడింది. మళ్లీ శుభ ఘడియలు రావడంతో పెళ్లిళ్లు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 31 వరకు ఏకంగా 53 మంచి ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహుర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. వందలో 99 మంది ఎక్కువగా ముహూర్తాలని నమ్ముతుంటారు. దీంతో ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో ఏ శుభకార్యమైన ఇప్పుడే చేసుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ శుభ ముహూర్తాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Read Also:2023 World Cup Tickets: నేడే ప్రపంచకప్ 2023 టిక్కెట్ల రిజిస్ట్రేషన్.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆగస్ట్ – 19, 20 ,22, 24, 26, 29, 30, 31
సెప్టెంబర్- 1, 2, 3, 6, 7, 8
అక్టోబర్ – 18, 19, 20 ,21, 22, 24 ,25, 26, 27 ,31
నవంబర్ – 1 ,2 ,8, 16 ,17, 18 ,19, 22 ,23, 24, 25, 28 ,29
డిసెంబర్ – 3 ,5 ,6, 7, 8 ,14, 15, 16 ,17 ,19, 20 ,21, 24, 31