NTV Telugu Site icon

KP Nagarjuna Reddy: బిజీబిజీగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం..

Kp Nagarjuna Reddy

Kp Nagarjuna Reddy

KP Nagarjuna Reddy: అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి నిత్యం బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓ వైపు పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపుల్లో భాగస్వామ్యం అవుతూనే.. మరోవైపు తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు శంకుస్థాపనలు.. మరోవైపు ప్రారంభోత్సవాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.. ఇక, ఈ రోజు ప్రకాశం జిల్లాలోని తన నియోజకవర్గం మార్కాపురంలో తర్లపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి.. తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు.. ఇక ఊర్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ.. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు.. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, రైతు భరోసా కేంద్రం భవనాన్ని, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించారు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.

Read Also: KTR: కాంగ్రెస్- బీజేపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటంలేదు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆలోచనలో భాగంగా వచ్చిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.. దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్తున్న మహా నేత వైఎస్‌ జగన్‌ అని అభివర్ణించారు.. సచివాలయ వ్యవస్థతో గ్రామంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి.. అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.. ఇలాంటి మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదులు తెలిపారు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి. ఇక, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా.. ఓ వృద్ధిరాలితో రిబ్బన్‌ కట్‌ చేసి పెద్ద మనసు చాటుకున్నారు కేపీ నాగార్జున రెడ్డి..