తాజాగా టెస్లా సంస్థ యజమాని, ప్రపంచకైరుడైన ఎలాన్ మాస్క్ ను మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ సంపాదన విషయంలో దాటేశాడు. ఈ విషయం సంబంధించి మార్క్ జూకర్ బర్గ్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు. ఇకపోతే మార్క్ 2020 సంవత్సరం తర్వాత ప్రస్తుతం మొదటిసారి మస్క్ ను జూకర్ బర్గ్ అధిగమించడం విశేషం. ప్రముఖ పత్రిక బ్లూ వర్క్ నివేదిక ప్రకారం.. జుకర్‌బర్గ్ సంపద186.9 బిలియన్ డాలర్లుగా ఉండగా., మస్క్ నికర సంపద 180.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
Also Read: Madhya Pradesh HC: “లివ్-ఇన్ రిలేషన్ షిప్” బ్రేకప్ తర్వాత మహిళ విషయంలో సంచలనాత్మక తీర్పు..
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో నీవిధికాల ప్రకారం.. మార్చి నెల ప్రారంభంలో మొదటిస్థానంలో ఉన్న మస్క్.. తన కంపెనీ టెస్లా షేర్లు రోజురోజుకు పడిపోవడంతో క్రమంగా ఆయన రిచెస్ట్ పర్సన్స్ జాబితాలో తన స్థానాన్ని ఒక్కో స్థానాన్ని కోల్పోతూ వస్తున్నారు. ఇకపోతే మస్క్ సంపద ఈ సంవత్సరం 48.4 బిలియన్ డాలర్స్ తగ్గిపోగా, అదే సమయంలో జుకర్ బర్గ్ తన సంపను 58.9 బిలియన్ల డాలర్లను జోడించారు. దీనితో తాజాగా శుక్రవారం నాడు మెటా ప్లాట్ ఫామ్ కొత్త రికార్డుతో సహా తాజా గరిష్టాలకు చేరుకున్నట్లు అయ్యింది.
Also Read: Drinks for Heatwave: వేసవి తాపం.. ఈ దేశీ పానియాలతో ఉపశమనం
నవంబర్, 2020 నుండి జుకర్‌బర్గ్ బ్లూమ్ బెర్గ్ అత్యంత ధనవంతుల ర్యాంకింగ్స్ లో మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు డిమాండ్ తగ్గడం, టెస్లా షేర్లు ఈ సంవత్సరం 34% పతనం, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చైనాలో పెరుగుతున్న పోటీ, అలాగే జర్మనీలో టెస్లా ఉత్పత్తి సమస్యల కారణంగా మస్క్ ను ప్రపంచ ధనవంతులలో నాల్గో స్టాహ్నానికి దిగ జార్చాయి.
