నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే వ్యవహరించిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. మార్క్ రుట్టే.. దాదాపు 14 ఏళ్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధానిగా డిక్ స్కూఫ్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మార్క్ రుట్టే.. కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే మార్క్ రుట్టే.. హంగు ఆర్భాటంతో కాకుండా.. చాలా సింపుల్‌గా ఒక డొక్కు సైకిల్‌పై ఇంటికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిబ్బందికి టాటా చెబుతూ సైకిల్ నడుపుకుంటూ వెళ్లిపోయారు.

2010లో మార్క్ రుట్టే తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే గతేడాది జులైలో రుట్టే ప్రభుత్వం కూలిపోయింది. రుట్టే ప్రధానిగా రాజీనామా చేయగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ బాధ్యతలు కొనసాగించారు. గతేడాది చివర్లో నెదర్లాండ్స్‌లో ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం తప్పలేదు. ఎట్టకేలకు గత మంగళవారం డిక్ స్కూఫ్ అధికారికంగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
Hollanda Başbakanı Mark Rutte,
14 yıldır yaptığı görevi devrettikten sonra başbakanlık ofisinden ayrılırken..Şöyle bir fotoğrafı bir İslam ülkesinde görememek!?pic.twitter.com/L2GRssTCmF
— Ayşe Sucu (@aysesucu) July 4, 2024