కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ..గ్యాంగ్‍స్టర్స్ బ్యాక్‍డ్రాప్‍లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’.. సూపర్ హిట్ అయింది.సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. హీరో విశాల్, ఎస్‍జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‍గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్న కథాంశం తో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో అంచనాలకు మించి ఈ సినిమా హిట్ అయింది. అక్టోబర్ 13న మార్క్ ఆంటోనీ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది.ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతుంది.మార్క్ ఆంటోనీ సినిమా ఓటీటీ లో తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్క్ ఆంటోనీ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేడు (అక్టోబర్ 14) ఆయన ఓ ట్వీట్ చేశారు.
“ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా మార్క్ ఆంటోనీ అదరగొట్టడం ఎంతో సంతోషంగా ఉంది. అమెజాన్ ప్రైమ్‍లో నంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. అన్‍లిమిటెడ్ ఎంటర్‌టైన్‍మెంట్‍ను ముఖ్యంగా నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే ఎంజాయ్ చేయండి” అని విశాల్ ట్వీట్ చేశాడు. మార్క్ ఆంటోనీ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ పోషించారు. ఈ సినిమాలో ఆమె మేకోవర్ చూసేందుకు అచ్చం సిల్క్ స్మితలాగే ఉన్నట్లు కనిపిస్తుంది.మార్క్ ఆంటోనీ చిత్రంలో విశాల్ డ్యుయల్ రోల్ చేశారు. ఈ సినిమాలో రితూ వర్మ హీరోయిన్‍గా నటించారు. సునీల్, సెల్వరాఘవన్, అభినయ, మహేంద్ర, నిళగల్ రవి, రెడిన్ కింగ్‍స్లే ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మినీ స్టూడియో పతాకంపై ఎస్ వినోద్ కుమార్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.మార్క్ ఆంటోనీ సినిమా రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి విశాల్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచింది.