NTV Telugu Site icon

Margani Bharat: చంద్రబాబు శ్రీవారి లడ్డూపై పెద్ద నింద వేశారు..

Margani Bharat

Margani Bharat

Margani Bharat: గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారన్నారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారన్నారు. ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారన్నారు. జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసిందన్నారు. జులై నెలలో వచ్చిన ట్యాంకులు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారన్నారు. ఎన్డీడీబీకి పంపించిన శ్యాంపుల్స్ రిపోర్ట్ జులై 23న వచ్చిందన్నారు. వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారని.. జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారన్నారు.

Read Also: Posani Krishna Murali: కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలి?

చంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారని.. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ మార్గాని భరత్ విమర్శించారు. నాలుగు ట్యాంకులు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారని తెలిపారు. 2014-19 మధ్య 14 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారన్నారు. 2019-24 మధ్య 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారన్నారు. చంద్రబాబుకు హిందుత్వం పట్ల.. హిందువుల పట్ల అసలు గౌరవం ఉందా అని ప్రశ్నించారు. బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు…అదేనా హిందుత్వమంటే అంటూ వ్యాఖ్యానించారు. వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారని ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలన్నారు. సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారని.. పాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనం చేసుకున్నారని ఆయన తెలిపారు. డిక్లరేషన్‌పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదన్నారు.

Read Also: Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా… తెలియక మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. NDDB నుంచి వచ్చిన నివేదిక….టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారన.. NDDB నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పర్మిషన్ లేదని.. మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే సిట్ అధికారులు అమలు చేస్తారని ఆరోపించారు. ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాయశ్ఛిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్‌కు తెలుసా అన్న ఆయన.. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలని మార్గాని భరత్ అన్నారు.

 

Show comments