NTV Telugu Site icon

Daggubati Purandeswari: బీజేపీలో చేరిన పలువురు వైసీపీ నేతలు.. ఎన్డీఏ కూటమితోనే ప్రగతి సాధ్యం..

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పలువరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. అనతరపురం, రాజంపేట, సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పదేళ్లుగా దేశ ప్రజల కోసం పని చేస్తోంది.. దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యం అన్నారు.. మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంక్షేమమే అన్నారు.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలనే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు.. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని వెల్లడించారు పురంధేశ్వరి..

Read Also: CM Chandrababu: భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

మరోవైపు, రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతం అవుతోంది గనుక కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు పురంధేశ్వరి.. అధికారులు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఐదేళ్ల వైసిపి అరాచక పాలనని ప్రజలు చూశారు.. 16 సంవత్సరాల బీసీ అమ్మాయి ఆమె అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే ఆమెను కిరాతకంగా చంపారు.. దీనిపై స్పందించలేదు… ఉత్తరాంధ్రలో డాక్టర్‌ ఆక్సిజన్ కొరత ఉందని కరోనా సమయంలో ప్రశ్నిస్తే తీవ్ర ఇబ్బందులు పెట్టారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి వెళ్ళిన అభ్యర్థుల చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు చింపేశారు.. నెల్లూరులో కత్తులతో ఓ మహిళ కార్యకర్తని గాయపరిచారు. లేఖ రాయడం కాదు గుండెలపై చేయి వేసుకొని వైఎస్‌ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

Read Also: Yogi Adityanath: కన్వర్‌ యాత్ర మార్గంలో హోటళ్లకు నేమ్‌బోర్డులు ఉండాల్సిందే..

ఇక, కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదు అన్నారు పురంధేశ్వరి.. మెడ్ టెక్ పార్క్ నిర్మాణంలో జితేంద్ర సింగ్ స్వయంగా జగన్ నుండి సహకారం లేదని చెప్పారు.. నితిన్ గడ్కరీ సహకారంతోనే చేశామని స్వయంగా చెప్పారు.. బీజేపీ సింహ భాగస్వామ్యం లేనిది రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని స్పష్టం చేశారు.. గతంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వ సహకార నిరాకరణపై పేర్ని నాని విఫులంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..