NTV Telugu Site icon

Asia Cup 2023: ఫైనల్లో గెలవడంపై టీమిండియాపై అభినందనల వెల్లువ

Asia Cup

Asia Cup

ఆసియా కప్ 2023 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టీమిండియా టైటిల్ గెలుచుకుంది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అంతకుముందు పాకిస్తాన్-శ్రీలంక ఆడిన మ్యాచ్ లో స్పిన్ కే ఎక్కువగా అనుకూలించింది. అందరూ శ్రీలంక స్పిన్నర్ యువ స్పిన్నర్ వెల్లలేగేపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో తారుమారైంది. మరోవైపు భారత్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు పలువురు క్రికెట్ దిగ్గజాలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ నుంచి యువరాజ్ సింగ్ వరకు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు. అయితే ఈ ఫైనల్ లో భారత్ 50 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. కేవలం 37 బంతుల్లోనే మ్యాచ్‌ గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం మహ్మద్ సిరాజ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర సాధించాడు.

Read Also: Game Changer : గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. భారత జట్టు ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు’ అని రాశాడు. శ్రీలంక క్రికెట్‌కు ఇది కష్టమైన రోజు. మహ్మద్ సిరాజ్ స్పెల్‌ను హ్యాండిల్ చేయడం అంత సులభం కాదని నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే.. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, మిథాలీ రాజ్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో సహా పలువురు క్రికెటర్లు టీమిండియా విజయానికి అభినందనలు తెలిపారు.

Read Also: Asaduddin Owaisi : అల్లా మా రూలర్.. అల్లా కోసమే ఉన్నాం.. అల్లా కోసమే పని చేస్తున్నాం..

తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా తరుఫున మహ్మద్ సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 7 ఓవర్లలో 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. శ్రీలంక తరఫున కుశాల్ మెండిస్ అత్యధికంగా 17 పరుగులు చేశాడు. 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత చిన్న టార్గెట్ ను భారత జట్టు 6.1 ఓవర్లలోనే విజయం సాధించింది. శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ నాటౌట్‌గా నిలిచారు.