Manu Bhaker: వారందరికీ కృతజ్ణతలంటున్న భారత ఒలంపిక్ విజేత..
- పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత షూటర్ మను భాకర్ చిరస్మరణీయ ప్రయాణం.
- వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో
- 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 2 కాంస్య పతకాలను సాధించి దేశానికి అందించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manu Bhaker On X: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత షూటర్ మను భాకర్ చిరస్మరణీయ ప్రయాణం ముగిసింది. శనివారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి మరో పతకాన్ని తృటిలో కోల్పోయింది. అయితే, ఆమె వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో, 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 2 కాంస్య పతకాలను సాధించి దేశానికి అందించింది. ఈ సందర్బంగా తన ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. 22 ఏళ్ల మను ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చింది. ‘నాకు లభిస్తున్న మద్దతు, శుభాకాంక్షలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. 2 కాంస్య పతకాలు సాధించడం కల సాకారమైంది. ఈ ఘనత నాదే కాదు, నన్ను నమ్మి నన్ను ఆదరించిన వారందరికీ దక్కింది. నా కుటుంబం, కోచ్ జస్పాల్ రాణా సర్, NRAI, TOPS, SAI, OGQ, Performax ముఖ్యంగా హర్యానా ప్రభుత్వంతో సహా నా మద్దతుదారుల యొక్క తిరుగులేని మద్దతు లేకుండా నేను దీన్ని ఎప్పటికీ చేయలేను. అంటూ తెలిపింది.
IND vs SL: భారత్‌తో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్! 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఎంట్రీ
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
మను తన పోస్ట్‌లో ఇంకా.. ‘మన దేశం కోసం అతిపెద్ద వేదికపై పోటీ చేయడం మంచి ప్రదర్శన ఇవ్వడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు.. నాతో అడుగడుగునా నిలబడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం అంటూ తెలిపింది. ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా మను సరికొత్త చరిత్రను లిఖించింది.
I am extremely overwhelmed by the support and wishes that have been coming in. Winning 2 bronze medals is a dream come true. This achievement is not just mine but belongs to everyone who has believed in me and supported me along the way. I couldn't have done it without the… pic.twitter.com/ZNrXz3D5Jg
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) August 3, 2024
తాజావార్తలు
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్‌కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!