మణిపూర్‌లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్రంలో భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలను షా పంపించారు.
Lions Attack Cow: నాలుగు సింహాల మధ్య చిక్కుకున్న ఎద్దు.. తన ప్రాణాలను ఎలా కాపాడుకుందంటే? (వీడియో)
సోమవారం జరిగిన సుదీర్ఘ సమావేశంలో సీనియర్ భద్రతా అధికారులతో హోంమంత్రి పరిస్థితిని వివరంగా సమీక్షించారు. అలాగే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులను అమిత్ షా కోరారు. మరోవైపు.. మణిపూర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పోలీసు బలగాల మోహరింపును కూడా పెంచుతోంది. 50 అదనపు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను అక్కడికి పంపుతోంది. ఇంతకు ముందు కూడా కేంద్రం 20 కంపెనీల బలగాలను అక్కడకు పంపించింది.
IPL Auction 2025: మిచెల్ స్టార్క్ రికార్డు బద్దలు కొట్టేది.. ఈ భారతీయ ఆటగాడే..!
మణిపూర్‌లో తాజా హింసాత్మక సంఘటనల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా.. కేంద్రమంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అసంపూర్తిగా వదిలివేసి, నార్త్ బ్లాక్‌లోని సీనియర్ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశంలో మణిపూర్‌లోని పరిస్థితిని సమీక్షించారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల అనంతరం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ కావడం గమనార్హం. హింసాత్మక సంఘటనల తరువాత.. ఆగ్రహంతో కొందరు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ధ్వంసం చేసి తగులబెట్టారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు.