Site icon NTV Telugu

Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Mani Ratnam Next Movie News, Vijay Sethupathi Sai Pallavi

Mani Ratnam Next Movie News, Vijay Sethupathi Sai Pallavi

సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి నటించబోతుండటం విశేషం. వీరిద్దరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అలాంటిది మణిరత్నం మార్క్ మేకింగ్‌లో వీరు కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే..

Also Read : Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 14 నుండి ప్రారంభం కానుంది. దానికి ముందుగా ఈ నెలాఖరులోనే ఒక పవర్‌ఫుల్ ప్రోమో షూట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబో అంటేనే అదొక మ్యూజికల్ వండర్. అలాంటిది సాయి పల్లవి, విజయ్ సేతుపతి లాంటి పర్ఫార్మర్స్ తోడవ్వడంతో ఈ సినిమా ఇండియన్ లెవల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా మారనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Exit mobile version