Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఆమె పడ్డ కష్టం, ఆ తర్వాత ఎదురైన ఆరోగ్య సమస్యలు (Weight issues) ఆమెను కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పెడుతున్నాయనేది బహిరంగ రహస్యం. గత ఏడాది విడుదలైన ‘ఘాటీ’ సినిమా ప్రమోషన్లలో కూడా ఆమె కనీసం వీడియో కాల్‌లో కూడా కనిపించకుండా కేవలం వాయిస్ క్లిప్స్‌తో సరిపెట్టడం ఆమె ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ఒక రూమర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Also Read : Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?
Also Read
అనుష్క తొలిసారి మలయాళంలో నటించిన పాన్-ఇండియా చిత్రం ‘కథనార్: ది వైల్డ్ సోర్సరర్’ (Kathanar: The Wild Sorcerer). జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ ఇటీవలే విడుదలై విజువల్స్ పరంగా వావ్ అనిపించింది. అయితే ఇందులో అనుష్కను ఒకటి రెండు షాట్స్‌కే పరిమితం చేయడంతో ఆమె రోల్ నిడివిపై సందేహాలు మొదలయ్యాయి. కానీ, చిత్ర బృందం మాత్రం అనుష్క ఈ సినిమా కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో జరిగే ప్రమోషన్లలో స్వయంగా పాల్గొంటుందని చెబుతోంది. ఇది ఆమె 50వ సినిమా కావడం, మలయాళంలో డెబ్యూ కావడంతో ఆమె ఈసారి మినహాయింపు ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.
మరోవైపు నెటిజన్లు మాత్రం, “స్ట్రయిట్ సినిమాలు చేసినప్పుడే రాని స్వీటీ, ఒక మలయాళ డబ్బింగ్ సినిమా కోసం వస్తుందా?” అని పెదవి విరుస్తున్నారు. మరి ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో విడుదల కానున్న ఈ సినిమా కోసం అనుష్క తన ఐదేళ్ల ‘ప్రమోషన్ బ్రేక్’ను చెరిపివేసి మీడియా ముందుకు వస్తుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ అనుష్క నిజంగానే ప్రమోషన్లలో పాల్గొంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం!
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!