Mangalavaram : అప్పడప్పడ తాండ్ర సాంగ్ మోత మోగిస్తుందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాయల్ రాజ్‌పుత్ ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది..వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న లేటెస్ట్ సినిమా “మంగళవారం”.. ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ట్రైలర్ విడుదల అయ్యాక ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి.. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రం సినిమా తో డిజాస్టర్ అందుకున్న అజయ్ భూపతి ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో నవంబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటినుంచే వరుసగా అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫోర్త్ సింగిల్‌ను విడుదల చేశారు.’అప్పడప్పడ తాండ్ర.. ఆవకాయ తాండ్ర నీకో ముక్క నాకో ముక్క’ అంటూ సాగే ఈ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాటలో కీడా కోలా దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు. అయితే ఈ పాట ఐటెం సాంగ్ అని తెలుస్తుంది. ఇక ఆంధ్రాలో ‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర’ పాట చాలా ఫేమస్. దీన్ని ఇప్పుడు తన సినిమాలో ఐటమ్ సాంగ్‌గా పెడుతున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ పాటను గణేష్ ఆడెపు రాశారు. రాహుల్ సింప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు… ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను ఊపేస్తుంది…ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య మరియు అజయ్ ఘోష్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్‌డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
తాజావార్తలు
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్‌డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!