తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ది ఉత్సవాలు కాదు కాంగ్రెస్ ఉత్సవాలు ను తలపించిందన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా పల్లా రవీందర్ రెడ్డి హల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు లో రేవంత్ పాత్ర చెప్పలేదని, ఉద్యమంలో పాల్గొనని వాళ్లు ఉత్సవo చేస్తే ఎలా ఉంటుందో అది కొరవడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిఎం రేవంత్ ఏమాత్రం సంబంధం లేదని, రాష్ట్ర ఏర్పాటు లో ముగ్గురు మహిళల పేరు సోనియా గాంధీ, సుస్మిత స్వరాజ్, మీరా కుమారి పాత్ర మరువలేనిది అన్న సిఎం సోనియా గాంధీ కోసం వెళ్ళినట్టే సుస్మిత స్వరాజ్ ఇంటికి ఎందుకు పోలేదని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ చరిత్రలో ఏ స్పీకర్ చేయని విధంగా మీరా కుమారి వ్యవహారించారు కాబట్టే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని, తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టిన శుశిల్ కుమార్ షిండే, మీరా కుమారి ని అవమానించే, తెలంగాణ గీతం అంశంలో కేసీఆర్ పదేండ్లు పొరపాటు చేసిండన్నారు. పదమూడు చరణాలలో మూడు మాత్రమే పెట్టి రేవంత్ రెడ్డి కూడా పొరపాటు చేసిండని, సారం, సందేశం, స్ఫూర్తి లేకుండా చేసి నైతికంగా చెప్పిండన్నారు. జాతీయ గీతం మాదిరే తెలంగాణ గీతం ఉంటుందని భావించామని, అందే శ్రీ రాసిన పాట యావత్ తెలంగాణ ఊర్రుతలుగించిందన్నారు.
అంతేకాకుండా.. ‘పది చరణాలు తొలగించిందుకు అందే శ్రీ కన్నీలు పెట్టుకోవాలి… భావ దారిద్రానికి నిదర్శనం. కొమురం భీమ్, పండుగ సాయన్నా, సర్వయ్ పాపన్న, కంచర్ల గోపన్న వంటి పోరాట యోధుల పేర్లు తొలగించిన పాట ను సితక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఎట్ల ఏమోదించినారు. అందే శ్రీ రాసిన.. నిన్న ప్రభుత్వం గుర్తించిన పాటను తెలంగాణ సమాజం గుర్తించం. అందే శ్రీ రాసిన పాట లో రెడ్డి సామాజిక వర్గం పేర్లు లేనట్టు ఉన్నాయ్ అందుకే బహుజన పేర్లు తొలగించినారు. పోరాట స్ఫూర్తి ని నిద్రబుచ్చే పాట నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపి… తెలంగాణ సమాజం ను నిద్ర పుచ్చేలా కుట్రలు చేస్తున్నారు… ఉద్యమ కాలం నాటి పాట ను అన్నీ పార్టీ లను ఏమోదించే విధంగా కృషి చేస్తా… బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తో ప్రకటన చేయిస్తా. కేసీఆర్ ను కల్సి ఆయనతోనూ ప్రకటన చేయిస్తా… రాజకీయ, కుల, మతాలకు అతీతంగా సదస్సు ఏర్పాటు చేస్త.. కళాతోరణం ను ఎందుకు తొలగించాలని చూస్తున్నారు. సమ్మక్క, సారలక్క లను చంపింది కాకతీయులు అయితే ఇంద్రవెళ్లి లో చప్పింది కాంగ్రెస్ కాదా… తెలంగాణ అమరుల చావుకు కారకులు సోనియా గాంధీ కాదా… 369మందిని పోలీస్ ల ద్వారా చంపింది కాసు బ్రాహ్మనంద రెడ్డి… కాంగ్రెస్ ప్రభుత్వం కే బీ ఆర్ పార్క్ ఎందుకు.. 2014 వరకు దాదాపు 1200 మృతి కి కారకులు’ అని ఆయన అన్నారు.