NTV Telugu Site icon

Suriya : మోహన్‌ బాబు బయోపిక్‌ లో నటిస్తున్న సూర్య ?

Suriya

Suriya

Suriya : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు హీరోగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇటీవల కన్నప్ప సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో తన తండ్రి మోహన్‌ బాబు బయోపిక్‌ గురించిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మోహన్‌ బాబు బయోపిక్ తీయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తన తండ్రి బయోపిక్‌ తీస్తే అందులో లీడ్‌ రోల్‌ను తమిళ్‌ స్టార్‌ హీరో సూర్యతో చేయించాలని అనుకుంటున్నట్లు మంచు విష్ణు అన్నారు. అంతే కాకుండా ఆ బయోపిక్‌కి తానే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానని విష్ణు పేర్కొన్నాడు.

Read Also:Hug Health Benefits: కౌగిలించుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

కంగువా సినిమా టీజర్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. తన అద్భుతమైన నటనతో సూర్య సర్‌ప్రైజ్ చేశారు. విజువల్స్ వండర్‌గా కంగువాను రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి మోహన్‌ బాబు బయోపిక్‌ గురించి ఆలోచన లేదు. కానీ తీస్తే కచ్చితంగా సూర్యతోనే తీయాలని అనుకుంటున్నట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చారు. మరి మోహన్‌ బాబు బయోపిక్‌కి సూర్య ఒప్పుకుంటాడా అనేది చూడాలి. మోహన్‌ బాబు సినీ కెరీర్‌ డౌన్‌ టు ఎర్త్‌ అన్నట్లు సాగిందన్న విషయం తెలిసిందే. ఒక చిన్న నటుడిగా మోహన్‌ బాబు కెరీర్‌ మొదలైంది. చాలా కష్టపడి, ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత మోహన్‌ బాబు స్టార్‌గా ఎదిగారు. బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు వసూలు సినిమాల్లో నటించారు.

Read Also:F-35 Stealth Fighters: భారత్‌కి F-35 స్టెల్త్ ఫైటర్లు.. అమ్మేందుకు అమెరికా సిద్ధం..

500లకు పైగా సినిమాలు చేసిన మోహన్‌ బాబు సినీ కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదొడుకులు ఉన్నాయనే చెప్పాలి. సినిమాటిక్ పరిణామాలు కూడా చాలానే ఉంటాయి. కనుక బయోపిక్ తీస్తే కచ్చితంగా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మంచు విష్ణుకు ఇప్పుడు వెంటనే బయోపిక్ చేయాలనే ఆలోచన లేదు.. కానీ భవిష్యత్తులో తన తండ్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బయోపిక్‌ను రూపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో ఎలాంటి డౌట్‌ లేదు అంటూ మంచు ఫ్యామిలీ అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.