Manchu Mohan Babu: విష్ణుకు ప్రమాదం.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Mohan Babu: మంచు విష్ణు ప్రస్తుతం హీరోగా నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచు కుటుంబం మీద వస్తున్న ట్రోల్స్ వలన.. ఆ కుటుంబం నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకులు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిదర్శనం జిన్నా. మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. మరి అంత ట్రోల్ కంటెంట్ ఏం కాదు. కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా చాలా సినిమాలతో పోలిస్తే బెటర్ గానే ఉంది. కానీ, మంచు కుటుంబంపై ఉన్న ట్రోలింగ్ వలనే ఈ సినిమా మంచిగా ఆడలేకపోయింది అనేది కొంతమంది అభిప్రాయం. అయితే ఈ ట్రోలింగ్ కంటెంట్ ను పక్కన పెట్టి.. ఎలాగైనా హీరోగా మరోసారి నిరూపించుకోవాలని విష్ణు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కన్నప్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొని ఆశ్చర్యపరిచాడు విష్ణు. ప్రభాస్, మోహన్ లాల్, శివన్న, అనుష్క లాంటి స్టార్లందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Ram Pothineni: ఉస్తాద్.. ఈసారి గట్టిగా ఇవ్వాలి.. గుర్తుపెట్టుకో
Also Read
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ షూటింగ్ లోనే విష్ణు ప్రమాదానికి గురయ్యాడు. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ ను వాయిదా వేయడం జరిగిందని, వెంటనే విష్ణు హాస్పిటల్ కు తీసుకెళ్లిన విషయం తెల్సిందే. ఇక తాజాగా విష్ణు ఆరోగ్యంపై మోహన్ బాబు ట్వీట్ చేశాడు. దేవుడు దయవలన మంచు విష్ణు బావున్నాడని చెప్పుకొచ్చాడు. “ఈ సమయంలో మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. న్యూజిలాండ్‌లో కన్నప్ప సెట్లో ప్రమాదం విష్ణుకు ప్రమాదం జరిగింది. భగవంతుని దయతో, అతను కోలుకునే మార్గంలో ఉన్నాడు. త్వరలో షూటింగ్‌కి తిరిగి వస్తాడు. అందరు విష్ణుకు సపోర్ట్ గా నిలిచినందుకు ధన్యవాదాలు.. హర హర మహాదేవ్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Grateful for all the love, wishes, and concern during @iVishnuManchu accident on the set of #Kannappa in New Zealand. By God's grace, he's on the road to recovery and will be back to shooting soon. Thank you for your support. 🙏 Har Har Mahadev!
— Mohan Babu M (@themohanbabu) November 1, 2023
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!