Manchu Manoj Couple: సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ కార్లలో ప్రయాణించడం సహజమే.. కానీ, మంచు మనోజ్ విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా జరిగింది. దీనికి కారణం మనోజ్ ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్ కావడంతో.. ఏమాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న ఆటోలోకి ఎక్కి ప్రయాణాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
PhonePe కొత్త ఫీచర్.. ఒక క్లిక్‌తో చెల్లింపు.!
హీరో మంచు మనోజ్ నిస్వార్థంలేని వ్యక్తిత్వంతో ఎప్పుడూ అభిమానులకు చేరువగా ఉంటారు. తాజాగా ఆయన తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి చేసిన ఆటో ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఒక సామాన్యుడిలా ఆటోలో ప్రయాణిస్తూ ఆ మధుర క్షణాలను ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Ambati Rambabu: వైసీపీ మాస్ పార్టీ.. జగన్ ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది వస్తున్నారు..
ఈ వీడియోను షేర్ చేస్తూ మనోజ్ రాసిన క్యాప్షన్ చాలా సరదాగా ఉంది. “కారు ఈరోజు కుదరదు అన్నప్పుడు.. హైదరాబాద్ ట్రాఫిక్ ‘ఎక్కేయ్’ (Hop in) అంటుంది” అంటూ “లైఫ్ హాపెన్స్.. లవ్ కీప్స్ రోలింగ్” (జీవితంలో అనుకోనివి జరుగుతుంటాయి.. కానీ ప్రేమ మాత్రం సాగిపోతూనే ఉంటుంది) అని రాసుకొచ్చారు. తన భార్య మౌనికను “వన్ అండ్ ఓన్లీ” అని అంటూ.. ఆమెతో గడిపిన ఈ “ఆటో టైమ్” ఎంతో ప్రత్యేకం అని పేర్కొన్నారు. ఇంకా నిర్మలమైన రోడ్లు, చల్లని గాలి, ఆటోలో సాగిన ఈ ప్రయాణం తమకు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాయని ఆయన అన్నారు.