Good News: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. మరోసారి డీఏను ప్రకటించింది. ఈ నెల జీతంతో పాటు కొత్త డీఏను చెల్లించనున్నట్లు పేర్కొంది. సంక్రాంతికి లక్షల మంది ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్లో ఎదురు చూస్తున్న కార్మికులకు పండగ రోజుల్లో శుభవార్త చెప్పింది. ఆరో డీఏ… సంక్రాంతి పండగకు ఆర్టీసీ కార్మికులు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. పండగకు పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు వెళుతుంటారు. అదనపు సర్వీసులను కూడా నడుపుతున్నారు. ఈ సీజన్ లో ఆర్టీసీకి ఆదాయం కూడా అదనంగా వస్తుంది. దీంతో మొత్తం ఏడు డీఏలకు ఆరు డీఏలను ప్రభుత్వం ఇచ్చినట్లయింది.
Read Also: ROBO Lawyer: తొలిసారి కోర్టులో వాదించనున్న రోబో లాయర్
ఇది ఇలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారికి సంక్రాంతి పెద్దపండుగ. దీన్ని కుటుంబంతోని జరుపుకునేందుకు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు పండుగ కోసం వెళ్లే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. దీంతో TS ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు ఇవాళ్టి నుండి ఈ నెల 14 వరకు నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ చార్జీలతోనే బస్సులు నడిపిస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంక్రాంతి పండుగ కోసం టీఎస్ ఆర్టీసీ ఈసారి 4,233 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. ఒకేసారి తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇక ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎండీ సజ్జనార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు బస్సులు అందించడానికి రద్దీ ప్రాంతాల్లో డీఎంలు, డీవీఎంలు, ఆర్ఎంలు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.