Site icon NTV Telugu

MSVPG: పాటలు హిట్ ఓకే.. మరి మెయిన్ వీడియో కంటెంట్ ఎక్కడ అంటున్న చిరు ఫ్యాన్స్..?

Manshankara Varaprasad, Chiranjeevi

Manshankara Varaprasad, Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ హిట్ అయి సినిమాకి కావాల్సినంత బజ్‌ని తీసుకురాగా. పాటలు బాగానే ఉన్నాయి కానీ, అసలు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాటలతోనే సరిపెట్టకుండా, కనీసం ఒక టీజర్ లేదా ట్రైలర్ లాంటిది రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read:Suriya-Bunny Vasu : సూర్యతో తన అనుభవం బయటపెట్టిన బన్నీ వాసు..

చిరంజీవి లాంటి పెద్ద హీరోను పెట్టుకుని, అనిల్ రావిపూడి ఎలాంటి కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూపించబోతున్నారో తెలుసుకోవాలంటే, తప్పకుండా ఏదో ఒక వీడియో కంటెంట్ రావాల్సిందే. ఒక టీజర్ వదిలినా కూడా సినిమా కథాంశం, మేకింగ్ పై ఒక చిన్నపాటి ఐడియా వస్తుంది. మరి మేకర్స్ ఈ ట్రైలర్ లేదా టీజర్ ట్రీట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో అని మెగా ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు.

Exit mobile version