మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా విడుదలైన “మన శంకర వరప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో చిరు ప్రతి ఒక డైలాగ్ హైలెట్ అయినప్పటికి.. ఇందులో ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విలన్ సచిన్ ఖేడ్కర్తో సంభాషిస్తూ.. ‘వాళ్ళు డబ్బున్న వాళ్లయ్యా.. ఇన్సల్ట్ చేస్తే వెళ్లిపోతారు’ అని చిరంజీవి చెప్పిన డైలాగ్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. కానీ ఈ డైలాగ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దట. ఈ ఐడియా స్వయంగా చిరంజీవిదేనని దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా జరిగిన సెలబ్రేషన్స్ లో వెల్లడించారు. చిరు మోహన్ బాబు మధ్య ఉన్న మంచి స్నేహం వల్ల ఆ సీన్ అంత సహజంగా, సరదాగా కుదిరిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బ్లాస్ట్ షురూ అంటూ.. క్రేజీ పోస్టర్ రిలీజ్
దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్‌ను మరోసారి వెండితెరపై ఆవిష్కరించింది. నయనతార కథానాయికగా నటించిన ఈ పూర్తిస్థాయి ఎంటర్టైనర్ను సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మించారు. కామెడీతో పాటు సెంటిమెంట్, మాస్ యాక్షన్ అదిరిపోయే పాటలు ఉండటంతో మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా విందు భోజనంలా అనిపిస్తోంది. అందులో వెంకీ ఎంట్రీతో సినిమా ఇంకా హైలెట్ అయ్యింది. అలా మొత్తానికి అనిల్ రావిపూడి తనదైన శైలిలో చిరంజీవిని ప్రెజెంట్ చేసి పెద్ద సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు.