మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ముందు నుంచి ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉండగా తాజాగా విడుదలైన ‘వరప్రసాద్ టీమ్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవి వెనుక హర్షవర్థన్, కేథరిన్, అభినవ గోమఠం తదితరులు ఉన్న స్టిల్‌ను చైతన్య రావు షేర్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. మరోవైపు ఓవర్సీస్‌లో అప్పుడే టికెట్ బుకింగ్స్ షురూ అవ్వగా కేవలం యూఎస్‌లోనే ఇప్పటికే 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం మెగాస్టార్ క్రేజ్‌ను చాటిచెబుతోంది. ఇక
Also Read : Aadi Sai Kumar : సాయికుమార్ ఇంట అంబరాన్నంటిన సంబరాలు.. మరోసారి తండ్రి అయిన ఆది
సినిమా విడుదలకు కేవలం 9 రోజులే సమయం ఉండటంతో, చిత్ర యూనిట్ ప్రచార వేగాన్ని పెంచింది. జనవరి 3న రాజమహేంద్రవరం నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన తిరుపతి, విశాఖ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో సాగనుంది. ముఖ్యంగా తిరుపతిలో ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. కొన్ని ముఖ్యమైన వేదికల్లో చిరంజీవి స్వయంగా పాల్గొని అభిమానులను ఉత్సాహ పరచనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
