మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొదటి వారం థియేటర్లలో దుమ్ములేపిన
ఈ సినిమా, రెండో వీకెండ్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లోనే బుక్ మై షో (BookMyShow)లో లక్షకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం మెగాస్టార్ మాస్ పవర్‌కు నిదర్శనం. నేడు ఆదివారం కావడంతో పాటు, రేపు సోమవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సెలవు కూడా కలిసి రావడంతో థియేటర్లన్నీ మెగా సందడితో కళకళలాడుతున్నాయి.
Also Read : Sreeleela : తమిళంలో మరో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్?
ముఖ్యంగా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో ‘వెంకీ గౌడ’గా చేసిన క్యామియో సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. సుష్మిత కొణిదెల మరియు సాహు గారపాటి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ లాంగ్ వీకెండ్ వసూళ్లు మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతూ, మెగా ఫ్యాన్స్‌కు అసలైన సంక్రాంతి పండుగను అందిస్తోంది.
