MSVG 4 days Collcetions: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సంక్రాంతి విడుదల ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ సినిమాతో చిరంజీవి తన స్థాయికి తగిన ఘనమైన రీ-ఎంట్రీ ఇచ్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలైన కేవలం నాలుగు రోజుల్లో రూ.190 కోట్ల మార్క్‌ను దాటింది. దక్షిణాదిన విడుదలైన ఇతర భారీ చిత్రాల కంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.
Snapdragon 8 Gen 5, 200MP కెమెరా, 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo లాంచ్.. ధర ఎంతంటే..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్-కామెడీ చిత్రంలో విక్టరీ వెంకటేష్, నయనతార కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, చిరంజీవి నటన ఇలా అన్ని కలిసి భారీ కలెక్షన్స్ కు దారి తీశాయి. ఈ రోజు గడిస్తే రూ. 200 కోట్ల మార్కును చేరుకుంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓవర్సీస్ మార్కెట్లలో ఈ చిత్రానికి భారీ కలెక్షన్ వచ్చాయి. వారాంతం ప్రారంభం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
NTR- Neel Dragon Movie: ఇట్స్ అఫీషియల్.. డ్రాగన్ సినీమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్
సీనియర్ హీరో వెంకటేష్, సచిన్ ఖేడేకర్, హర్ష వర్ధన్, జరీనా వహాబ్ వంటి వారు కీలక సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.
