Site icon NTV Telugu

Mana Shankara Vara Prasad Garu:‘మన శంకర వరప్రసాద్ గారు’పై కొత్త బజ్.. మెగాస్టార్ నుంచి మరో ట్రీట్..

Manashankara Varaprasad Garu

Manashankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సంక్రాంతి బరిలో అత్యంత అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే, తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆడియెన్స్‌కు ఊహించని ఒక భారీ సర్ప్రైజ్ ఉండబోతోంది. అది కూడా ఒక స్పెషల్ సాంగ్ అని, ఆ పాట నేరుగా థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది.

Also Read : Kartik Aaryan : హోటల్ రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన కార్తీక్ ఆర్యన్.. స్పందించిన కరీనా !

గతంలో ఈ చిత్రంలో రమణ గోగుల కాంబినేషన్‌లో ఒక పాట ఉంటుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వినిపిస్తున్న ఆ క్రేజీ సర్ప్రైజ్ ఆ పాటే నా లేక మరేదైనా స్పెషల్ క్యామియో సాంగా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. విడుదలైన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, ఈ ‘సీక్రెట్ సాంగ్’ వార్త మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపు అంటే జనవరి 11న సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version