Boss Office Rampage: మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సునామీని కొనసాగిస్తున్నారు. ఆయన లేటెస్ట్ సెన్సేషన్ “మన శంకర వరప్రసాద్ గారు” (MSG) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను ఏమాత్రం ఆపడం లేదు. విడుదలైన మూడో వారంలో కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ BookMyShow (BMS) లో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం బుక్‌మైషోలో ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా టికెట్ల విక్రయాలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీనితో రీజనల్ సినిమాల విభాగంలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ఇది అగ్రస్థానానికి చేరుకుంది. గతంలో అనిల్ రావిపూడి-వెంకటేష్ కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (3.59 మిలియన్లు) పేరిట ఉన్న రికార్డును ఈ సినిమా ఇప్పుడు అధిగమించింది. కేవలం 14వ రోజే ఈ సినిమా ఏకంగా 1.22 లక్షల టికెట్లను విక్రయించి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రతి గంటకు 9 వేల పైచిలుకు టికెట్ల విక్రయాలతో ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం.
READ ALSO: Rahul Gandhi: రాహుల్ గాంధీకి సీటు కేటాయింపుపై వివాదం.. అసలు ప్రోటోకాల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
ఇక్కడే కాదు కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ మెగాస్టార్ మ్యాజిక్ పని చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం $3.5 మిలియన్ల మైలురాయి వైపు దూసుకుపోతోంది. ఇది చిరంజీవి కెరీర్‌లోనూ, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సికమా ఇప్పటికే చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా అవతరించింది.ఇప్పుడున్న ఊపు చూస్తుంటే, లాంగ్ రన్‌లో ఈ సినిమా సులభంగా 400 కోట్ల మార్కును చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
READ ALSO: Ranabali Glimpse: విజయ్ – రశ్మిక హ్యాట్రిక్ సినిమా షురూ.. ‘రణబాలి’ గ్లింప్స్ చూశారా!
