Viral : విచిత్రమైన బండి గురించి వెలుగులోకి వచ్చినప్పుడల్లా వెంటనే అది మన వాళ్లే చేసి ఉంటారని ఆలోచన వస్తుంది. మీరు సోషల్ మీడియాలో కనుక స్క్రోల్ చేస్తే చాలా విచిత్రమైన వాహనాల వీడియోలను చూడవచ్చు. భారతీయులు చాలామంది తమ మెదడులకు పని పెట్టి కొత్త కొత్త ఆలోచనలతో బండ్లను తయారు చేస్తుంటారు. ఇది చూసి పెద్ద పెద్ద ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోక మానరు. అలాంటి వాహనాల తయారీలో భారతీయులు మాత్రమే ముందు లేరు. మనతో పోటీ పడి విదేశీయులు కూడా చాలా మంది వెరైటీ వెహికిల్స్ తయారు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నవ్వుతారు.
Read Also:Pakistan attacks Iran: ఇరాన్‌పై పాకిస్తాన్ ప్రతీకార దాడులు.. బలూచ్ గ్రూపులే లక్ష్యం..
సాధారణంగా ప్రజలు మంచులో కారు నడిపినప్పుడు అందులో కూరుకుపోతుండడం తెలిసిందే. దీని కారణంగా కారు మంచులో జారిపోకుండా ఓ క్రియేటర్ సరికొత్త ఆలోచన చేశాడు. తన ల్యాండ్ రోవర్‌కు రిక్షా చక్రాలను అమర్చాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:Hanu Man: హీరో తేజ సజ్జాను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
వైరల్ అవుతున్న వీడియో ఏదో కొండ ప్రాంతానికి చెందినదిగా తెలుస్తోంది. ఒక వ్యక్తి తన కారుకు రిక్షా చక్రాలను అమర్చాడు. కారు కాసేపు మంచులో మంచి వేగంతో నడిచింది. కానీ కాసేపైన తర్వాత వాహనం మొత్తం మంచుతో కప్పబడిన గుంతలో ఇరుక్కుపోతుంది. ఈ కారులో కేవలం డ్రైవర్ మాత్రమే ప్రయత్నించాడు.. కానీ తన ప్రయత్నంలో సఫలం కాలేకపోయాడు.