Dollars : అమెరికాలో డాలర్ల వర్షం.. రోడ్డుపై కార్లు ఆపి ఎగబడ్డ జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dollars : ఈ కాలంలో పిల్లికి కూడా బిచ్చం పెట్టని వారున్నారు. ఆర్థికంగా బాగానే ఉన్నా.. ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని అనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారి కోవలోకే చెందిన అమెరికాలోని ఓ యువకుడు హైవేపైన డాలర్ల వర్షం కురిపించాడు. కారులో నుంచి వంద డాలర్ల నోట్లను బయటకు విసిరేశాడు. దీంతో వెనక కార్లలో వస్తున్న జనం తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపి, నోట్లు ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటన అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కానీ ఇది పిచ్చి చేష్ట అని, తమ ఖాతాలో సొమ్మంతా ఖాళీ చేస్తున్నాడని.. తమను రోడ్డున పడేసే పరిస్థితికి తెస్తున్నాడని సదరు యువకుడి కుటుంబం వాపోతోంది. ఒరెగాన్ కు చెందిన కొలిన్ డేవిస్ మెక్ కార్తీ ఈ నెల 11న హైవే పైన కారులో ప్రయాణిస్తూ రెండు లక్షల విలువైన (సుమారు రూ.1.6 కోట్లు) వంద డాలర్ల నోట్లను బయటకు వెదజల్లాడు.
Read Also: Madhavan : పుత్రోత్సాహంతో మాధవన్.. 5బంగారు పతకాలు సాధించిన కొడుకు
Also Read
బిజీగా ఉన్న హైవేపైన ఒక్కసారిగా నోట్ల వర్షం కురియడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. కార్లలో నుంచి దిగిన జనం వంద డాలర్ల నోట్లను ఏరుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై మెక్ కార్తీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ ఖాతాలో నుంచి సొమ్మంతా తీసి ఇలా విసిరేశాడని, కుటుంబం మొత్తాన్నీ రోడ్డుమీదికి లాగాడని ఆరోపించారు. అయితే, బ్యాంకు ఖాతా ఉమ్మడి ఖాతా కావడంతో తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. దీంతో తమ పరిస్థితిని వివరిస్తూ.. నోట్లు దొరికిన వారు ఒరెగాన్ పోలీసులకు అప్పగించాలంటూ మెక్ కార్తీ కుటుంబ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Tags
- dollor rain
- Freeway
- Oregon
- USA
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!