NTV Telugu Site icon

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో మరో అమానుష ఘటన.. కదిలే కారులో బలవంతంగా పాదాలు నాకించి..

Madhyapradesh

Madhyapradesh

Madhyapradesh: గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన ఘటనను మరువక ముందే మధ్యప్రదేశ్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసిన కొందరు వ్యక్తులు.. కదిలే కారులో అతడిని చితకబాది బలవంతంగా అతడితో పాదాలు నాకించి వికృతంగా ప్రవర్తించారు. కదులుతున్న వాహనంలో ఓ వ్యక్తి పాదాలను మరో వ్యక్తి నాకుతున్నట్లు కనిపించిన వీడియో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని దాబ్రా పట్టణానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

Also Read: Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నిందితులు బాధితుడి ముఖంపై పదేపదే కొట్టారు. నిందితులు మాటలతో దుర్భాషలాడారు. బాధితుడిని కదులుతున్న కారులో ‘గోలు గుర్జర్ తండ్రి’ అని చెప్పాలని బలవంతం చేశారు. ఓ వ్యక్తి చాలాసార్లు చెప్పుతో కొట్టాడు. అంతటితో ఆగకుండా ఇద్దరు నిందితులు అతడితో బలవంతంగా తమ పాదాలను నాకించారు. ఈ తతంగాన్ని కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో కాస్తా వివాదాస్పదంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులు అతడిపై ఎందుకు దాడి చేశారన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

Also Read: Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్‌ టికెట్‌ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!

శుక్రవారం సాయంత్రం వీడియో వైరల్‌గా మారిందని, దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని దబ్రా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) వివేక్ కుమార్ శర్మ తెలిపారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ దండోటియా దబ్రా ఈ వీడియోను ధ్రువీకరంచారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐపీసీలోని పలు నిబంధనల ప్రకారం కిడ్నాప్, దాడి కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్‌గా మారిన కొద్ది రోజులకే ఈ షాకింగ్ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో నిందితుడు ప్రవేశ్ శుక్లాను గురువారం అరెస్టు చేశారు.