Man Recieved Thomson tv insted of Sony TV in Flipkart: ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో పెద్ద సైజు స్మార్ట్ టీవీలకు చాలా డిమాండ్ కూడా ఉంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో టీవీలు చాలా చౌక ధరలకు లభిస్తున్నాయి, ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ – అమెజాన్ వంటి కంపెనీలు పండుగ సీజన్‌లో అనేక రకాల ఆఫర్‌లను తీసుకువస్తాయి కాబట్టి. ఈ నేపథ్యంలోనే ఆయా టీవీల ధరలలో భారీ తగ్గుదల కనిపిస్తుంది. కానీ ఈ సేల్స్ లో జనం మోసానికి కూడా గురవుతారు. తాజాగా ఒక వ్యక్తి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఆర్యన్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ నుంచి లక్ష రూపాయల విలువైన సోనీ స్మార్ట్ టీవీని ఆర్డర్ చేశాడు. అయితే ఆ పెట్టె తెరిచి చూసేసరికి షాక్ తిన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘నేను అక్టోబర్ 7న Flipkart నుండి Sony TVని ఆర్డర్ చేసా, టీవీ అక్టోబర్ 10న డెలివరీ చేయబడింది. అక్టోబర్ 11న సోనీకి చెందిన వ్యక్తి ఇన్‌స్టాలేషన్ కోసం వచ్చాడు.
WhatsApp: ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్ ఇక పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!
అతను స్వయంగా టీవీని అన్‌బాక్స్ చేసి చూస్తే సోనీ బాక్స్ నుండి థామ్సన్ టీవీ రావడం చూసి మేమంతా ఆశ్చర్యపోయాము. ఆది మాత్రమే కాదు ఆ బాక్స్ లో ఎలాంటి ఉపకరణాలు కూడా లేవు. అంటే స్టాండ్ – రిమోట్ లాంటివి లేవని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్యన్ వెంటనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. మీకు అందిన పార్శిల్ చిత్రాలను షేర్ చేయాలని ఫ్లిప్‌కార్ట్‌ని కోరింది. ఆ తర్వాత రిటర్న్ అభ్యర్థన ఇంకా ప్రాసెస్ కాలేదు, రిజల్యూషన్ వ్యవధి అక్టోబర్ 24 వరకు ఉంది, కానీ రిజల్యూషన్ మెసేజ్ 20వ తేదీనే వచ్చింది, ఆపై తేదీని నవంబర్ 1 వరకు పొడిగించారు. ఆ తర్వాత కూడా టీవీ తిరిగి రాలేదు. అక్టోబర్ 25న మళ్లీ రిసాల్వ్ అయినట్టు సందేశం వచ్చింది కానీ టీవీని మాత్రం మార్చలేదు. నిజానికి పాపం ఆర్యన్ ప్రపంచకప్‌ను చూసేందుకు ప్రత్యేకంగా టీవీని కొనుగోలు చేశాడు. కానీ ఈ టీవీ అతనికి ఒక పీడకలగా మారింది.
I had purchased a Sony tv from @Flipkart on 7th oct, delivered on 10th oct and sony installation guy came on 11th oct, he unboxed the tv himself and we were shocked to see a Thomson tv Inside Sony box that too with no accessories like stand,remote etc 1/n pic.twitter.com/iICutwj1n0
— Aryan (@thetrueindian) October 25, 2023