Young Man Plays with Huge Cobra in Kadiri: చాలా మంది పామును చూస్తేనే ప్రాణ భయంతో ఆమడ దూరం పరుగెడుతుంటారు. ఇక నాగుపాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా?.. వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతారు. అయితే ఓ యువకుడు నాగుపామును చూసి ఏమాత్రం భయపడకపోగా.. దానితో ఆటలు ఆడాడు. అక్కడితో ఆగకుండా దాన్ని విసికించాడు. కోపంలో ఆ నాగుపాము అతడిని కాటేసింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల ప్రకారం… సత్యసాయి జిల్లా కదిరిలో నాగరాజు అనే యువకుడు పూటుగా మద్యం సేవించాడు. రోడ్డుపై వెళుతుండగా అతడికి ఓ నాగుపాము కనిపించింది. మద్యం మత్తులో ఉన్న నాగరాజు.. రోడ్డుపైనుంచి పొదల్లోకి వెళుతున్న నాగుపామును పట్టుకున్నాడు. చేతితో పట్టుకుని దాన్ని రోడ్డు మీద వేయగా బుసలు కొట్టింది. అయినా కూడా నాగరాజు భయపడలేదు. మద్యం మత్తులో ఉన్న అతడు నాగుపాముతో ఆటలు ఆడాడు. అక్కడున్న వారు వద్దని చెప్పినా వినిపించుకోలేదు. నాగుపాము తల వద్ద చేయి పెట్టి ఆడుతుండగా అది కాటేసింది.
Also Read: Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వేటు వెనుక భారీ కుట్ర!
నాగుపాము కాటేసినా నాగరాజు దాన్ని వదలలేదు. దాన్ని కాలుతో తొక్కాడు. చివరకు అది పొదల్లోకి పారిపోయింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని నాగరాజును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘పాము అంతసేపు ఓపికగా ఉండడమే గ్రేట్’, ‘మద్యం ఎంతపని చేసింది’, ‘హీరో అవుదామనుకున్నాడు కానీ బిస్కెట్ అయ్యాడు’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నాగుపాముతో ఆటలు ఆడిన నాగరాజు.. కాటు వేయడంతో పరిస్థితి విషమం
సత్యసాయి జిల్లా కదిరిలో మద్యం మత్తులో నాగరాజు అనే యువకుడు నాగుపాముతో ఆటలు ఆడాడు.
నాగుపాము పొదల్లోకి వెళ్తుంటే పట్టుకొని రోడ్డు మీద వేస్తుండగా, అతన్ని నాగుపాము కరించింది.. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా… pic.twitter.com/cV7yv0iQ2v
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024