శంషాబాద్ లో ఒ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచాడు. పెంచిన గంజాయి విక్రయిస్తాడా? అతనే సేవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామంలో ఒ వ్యక్తి తన ఇంట్లో రెండు గంజాయి మొక్కలు పెంచాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అతని ఇంటి వద్దకు చేరుకుని మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అసలు పెంచిన గంజాయి మొక్కలు విక్రయిస్థాడా లేదంటే తానే సెవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అతని ఇంట్లో లభించిన మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని టెస్టింగ్ కోసం పంపించారు. పోలీసులు మాత్రం గంజాయి మొక్కల కాదా అనేదానిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించంలేదు. ప్రస్తుతానికి అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
READ MORE: Zohran Mamdani: “స్టాట్యూ ఆఫ్ లిబర్టీ”కి బుర్ఖా.. మమ్దానీ గెలుపు తర్వాత ఇస్లామోఫోబిక్ పోస్టులు..
మరోవైపు.. ఐటీ, ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణ.. గంజాయి, డ్రగ్స్ హబ్‌గా మారితే మనందరం విఫలమైనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ వైపు చూస్తే వారి వెన్ను విరుస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే స్పష్టంగా చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
READ MORE: Dhanush : ధనుష్ లాంటి పాత్రలు టాలీవుడ్ లో చేసేది ఆ ఒక్కడే..!
