Aadujeevitham: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘ఆడు జీవితం’.. 25 రోజుల్లోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithviraj Sukumaran’s Aadujeevitham Movie Collections మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్). సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఆడు జీవితం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూల్ చేసింది. మలయాళంలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలోకి ఆడు జీవితం చేరింది.
ఈ సినిమా విజయంపై పృథ్వీరాజ్ సుకుమారన్ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ ట్వీట్ చేస్తూ సినిమాని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ది గోట్ లైఫ్ కొత్త శిఖరాలను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. మీ అచంచలమైన ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు’ అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ ఆడు జీవితం. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెబుతూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ను రచించారు. 2008లో ఈ నవల అత్యధికంగా అమ్ముడైంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Also Read: Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సచిన్ ట్వీట్ వైరల్!
గోట్ డేస్‌ను సినిమాగా తీయాలనే ఆలోచనతో డైరెక్టర్ బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి ఆడు జీవితంను ఆయన తెరకెక్కించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ఏకంగా 31 కిలోల బరువు తగ్గారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో 72 గంటల పాటు భోజనం లేకుండా.. కేవలం మంచి నీళ్లు, బ్లాక్ కాఫీ మాత్రమే తాగారు. అంతలా కష్టపడిన పృథ్వీరాజ్‌కు మంచి విజయమే దక్కింది. సలార్ విజయం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!