Suicide: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వెదురుకుప్పంలో పురుగుల మందు తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ముల భూమి పరిష్కార విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని.. చంద్రశేఖర్‌ను పోలీసులు కొట్టడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చంద్రశేఖర్ (50) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. వెదురుకుప్పం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు శవంతో బంధువులు నిరసన చేపట్టారు.
Read Also: Pakistan: పాకిస్థాన్‌పై నిషేధం!.. ముస్లిం దేశాలు ఎందుకు వీసా ఇవ్వడం లేదంటే?
చంద్రశేఖర్ బంధువులు పోలీస్ స్టేషన్‌కు దూసుకెళ్లారు. చంద్రశేఖర్ మృతికి కారణం పోలీసులే అంటూ పోలీసులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో వెదురుకుప్పం పోలీస్ స్టేషన్‌కు సీఐ, డీఎస్పీ చేరుకున్నారు. చంద్రశేఖర్ బంధువులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. వారు అక్కడి నుంచి వెళ్లాలని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.