NTV Telugu Site icon

Mumbai: పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి.. అడ్డొచ్చిన వారిని..!

Mumbai

Mumbai

పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో ఆ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడిపై బాలుడు పదే పదే కత్తితో దాడికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు పాల్పడుతుండగా.. అక్కడే ఉన్న కొంతమంది ఆపలేకపోయారు. అలానే చూస్తూ ఉండిపోయారు. కాగా.. ఈ దాడికి సంబంధించి అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. మృతుడు అహ్మద్ పఠాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఓ మహిళ సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటన ఆగస్ట్ 8న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also: Rajasthan Shocker: భార్యకు ఘోరమైన శిక్ష.. బైకుకి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త..

శివాజీ నగర్‌లోని రోడ్డుపై బాధితుడు పఠాన్ నిలబడి ఉండగా.. ఒక్కసారిగా మైనర్ బాలుడితో సహా నలుగురు అతనిపై పడ్డారు. ఆ తర్వాత బాలుడు పఠాన్‌పై ఆవేశంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని ఆపుదామని వచ్చిన బాటసారులను కూడా బాలుడు బెదిరించాడు. ఈ క్రమంలో.. పఠాన్ పై మైనర్ బాలుడు పలుసార్లు దాడి చేస్తూనే ఉన్నాడు. కాగా.. మృతుడు, నిందితులు ఒకరికొకరు తెలుసని.. రెండు వారాల క్రితం వారి మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Bangalore Bus Accident: బెంగళూరు ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన ఓల్వో బస్సు!

ఈ క్రమంలో పఠాన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో థానేలోని రాబోడి ప్రాంతంలో పాత గొడవలు కారణంగా 40 ఏళ్ల వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవ్వడంతో.. దుకాణ యజమానులు తమ సంస్థలను మూసివేశారు. బాధితుడు వసీం ఖురేషీ ఛాతీ, ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

Show comments