Defence Department : దేశాన్ని కాపాడటంలో రక్షణశాఖ ఎంత కీలకం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రక్షణశాఖకు సంబంధించిన ఫొటోలు గానీ వీడియోలు గానీ బయట పెడితే కఠిన చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు. అలాంటిది అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి రక్షణశాఖకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఏకంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంకు చెందిన బి రవి(36) ఐటిఐ పూర్తి చేసి డాక్ యార్డ్ షిప్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్టర్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. సబ్ మెరైన్, యుద్ధ నౌకలు, తూర్పు నావిక దళానికి చెందిన ఫొటోలను వెబ్ సైట్ లో పెడుతున్నాడు రవి. నావి ఇంటెలిజెన్స్ అధికారులకు ఈ విషయం తెలిసింది.
read also : Balakrishna : నా సినిమాలు మెసేజ్ ఇస్తాయి.. బాలకృష్ణ కామెంట్స్
దీంతో రవిని వాళ్లు అదుపులోకి తీసుకున్నారు. రవిని మల్కాపురం పోలీసులుకు నావెల్ ఇంటెలిజెన్స్ అధికారులు అప్పగించారు. మల్కాపురం సిఐ గొల గాని అప్పారావు ఈ కేసును విచారిస్తున్నారు. పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ శాఖ విషయంపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మన దేశ రక్షణ వ్యవస్థ ఇన్ఫర్మేషన్ ను పాకిస్థాన్ కు తెలియజేస్తున్న చాలా మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని ఇప్పటికే ప్రభుత్వం చెబుతున్నా కొందరు ఇలాంటి పనులతో కటకటాల పాలవుతున్నారు.
read also : Nude Calls : ఈజీ మనీ కోసం న్యూడ్ కాల్స్, చాటింగ్.. గ్రామాల్లో కొత్త దందా
