‘ప్రేమలు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు, ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవలే ‘డ్యూడ్’ చిత్రంతో పలకరించిన ఈ భామ, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. మమితా బైజు ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో గతంలోనే ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆషిక్ ఉస్మాన్ సమర్పణలో ఫ్యూర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందట.
Also Read : MSVG :మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ వారం రోజుల్ల కలెక్షన్..
మమిత చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ ఏ.డి దర్శకత్వంలో నివిన్ పౌలీ సరసన ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ అనే సినిమా చేస్తోంది. ఇది కాకుండా, తమిళ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’లో కీలక పాత్ర పోషించిన మమిత, ప్రస్తుతం సూర్య సరసన కూడా ఒక భారీ చిత్రంలో నటిస్తోంది. వరుసగా అగ్ర హీరోలు , యువ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ మలయాళ కుట్టి, తన కొత్త ప్రేమకథతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.