Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamidikaya Pappucharu: వేసవి కాలంలో మామిడికాయతో చేసే వంటకాలను బాగా తినడానికి ఇష్టపడుతుంటాము. ఎందుకంటే వేసవి అయిపోతే మళ్లీ మామిడి కాయలు దొరకవు కాబట్టి. అలాంటి వారికోసం మామిడి కాయలతో చేసే వంటలలో మామిడికాయ పప్పుచారు ఒకటి. మామిడికాయ పులుపు, కందిపప్పు రుచి, వెల్లుల్లి-జీలకర్ర ఫ్లేవర్ కలిసిన ఈ పప్పులుసు వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఎంతో కమ్మగా తయారయ్యే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. మరి దీనిం ఎలా తయారు చేయాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
పప్పు ఉడికించడానికి..
* కందిపప్పు – 1 గ్లాస్ (250 గ్రా.)
* ఉల్లిపాయ – 1
* పచ్చిమిర్చి – 2
* టమాటాలు – 2
* పసుపు – 1 టీ స్పూన్
* నీరు – 1½ గ్లాసులు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
పప్పుచారు కోసం..
* పుల్లటి మామిడికాయ – 1 (200 గ్రా.)
* ఉల్లిపాయ – 1 (సన్నని ముక్కలుగా కట్ చేసినది)
* నెయ్యి – 1 టీ స్పూన్
* నూనె – 4 టేబుల్ స్పూన్లు
* మెంతులు – కొద్దిగా
* ఆవాలు – 1 టీ స్పూన్
* జీలకర్ర – ½ టీ స్పూన్
* ఎండుమిర్చి – 2
* కరివేపాకు – 3 నుంచి 4 రెమ్మలు
* పసుపు – 1 టీ స్పూన్
* కారం – ¾ టీ స్పూన్
* ఇంగువ – 1 టీ స్పూన్
* ఉప్పు – తగినంత
* వెల్లుల్లి రెబ్బలు – 10
* కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం:
పప్పు సిద్ధం:
కందిపప్పును శుభ్రంగా కడిగి కనీసం గంటసేపు నానబెట్టాలి. తర్వాత నీటిని వంపేసి మరోసారి కడిగి కుక్కర్లో వేయాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పసుపు, నీరు వేసి మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
పప్పుచారు తాలింపు:
ఒక మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
మామిడికాయ ముక్కలు ఉడికించుకోవడం:
మామిడికాయను తొక్క తీయకుండా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు, కారం, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. అనంతరం మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నని మంటలో ముక్కలు కొద్దిగా మగ్గే అయ్యే వరకు ఉడికించాలి.
పప్పు కలిపే విధానం:
కుక్కర్లో ఉడికిన పప్పును మెత్తగా మెదిపి అందులో తగినంత నీరు కలిపి పల్చగా చేసుకోవాలి. ఈ పప్పు మిశ్రమాన్ని మామిడికాయ ఉడుకుతున్న గిన్నెలో పోసి బాగా కలపాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు లేదా కారం సర్దుబాటు చేసుకోవాలి.
వెల్లుల్లి-జీలకర్రతో ప్రత్యేక ఫ్లేవర్:
వెల్లుల్లి రెబ్బలు, జీలకర్రను కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పప్పుచారుసు మరుగుతున్న సమయంలో ఈ మిశ్రమాన్ని వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. దీనివల్ల పప్పుచారుకు అద్భుతమైన రుచి, సువాసన వస్తాయి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే కమ్మని మామిడికాయ పప్పుచారు సిద్ధం.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!