Mamata Benerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర బెంగాల్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. భారీ వర్షాల కారణంగా ఉత్తర బెంగాల్‌లోని సలుగరాలోని ఆర్మీ ఎయిర్ బేస్‌లో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పంచాయతీ సమావేశం ముగిసిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బాగ్డోగ్రా నుంచి జల్పాయిగురికి హెలికాప్టర్‌లో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమెను వెంటనే రోడ్డు మార్గంలో అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి మమతా బెనర్జీ కోల్‌కతాకు తిరిగి బయలుదేరారు.
Also Read: PM Modi: విపక్షాలు భయపడుతున్నాయి.. వారిని చూస్తే జాలేస్తోంది..
నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై, పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. నిదానంగా ప్రారంభమైన రుతుపవనాలు ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక ప్రాంతాలను కవర్ చేస్తూ వేగంగా పురోగమిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కార్యాలయం తెలిపింది.