Site icon NTV Telugu

Mamata Banerjee: దేశంలో అత్యాచార ఘటనలపై ప్రధానికి దీదీ లేఖ..

Mamatha

Mamatha

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోల్‌కతాలోని ఆర్‌జి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరంతరం విమర్శలకు గురవుతున్న తరుణంలో సీఎం మమత ప్రధానికి లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.

Read Also: US: చదువు కోసం వెళ్లి వక్రబుద్ధి.. వ్యభిచారం కేసులో తెలుగోళ్లు అరెస్ట్

మమతా బెనర్జీ రాసిన లేఖలో ఏముంది..?
సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి రాసిన లేఖ అంశాన్ని.. ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ వివరించారు. “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ‘దేశంలో అత్యాచారం కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతిరోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, ఇది సమాజం యొక్క విశ్వాసాన్ని.. మనస్సాక్షిని కదిలిస్తుంది. దేశంలో ఉన్న మహిళలంతా తాము సురక్షితంగా ఉన్నామన్న భరోసా ఇవ్వగలగాల్సిన అవసరముంది” అని లేఖలో ప్రస్తావించారు.

అదే లేఖలో.. “ఇటువంటి కఠినమైన నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా శిక్షించే నిబంధనతో కూడిన కేంద్ర చట్టం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అటువంటి కేసులలో సత్వర న్యాయం జరిగేలా చూడటం అవసరం. సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడాన్ని కూడా చట్టం పరిగణించాలి. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.

Exit mobile version