NTV Telugu Site icon

Mamata Banerjee: కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Coeme

Coeme

ఎన్నికల ప్రచారంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలపైనే ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీతో కలిసి కాంగ్రెస్‌, వామపక్షాలు.. తృణమూల్‌ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానేనని.. అలాగే కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌.. బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌, వామపక్షాలకు ఎవరూ ఓటు వేయొద్దని ప్రజలకు మమత పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Baak: తమన్నా, రాశి ఖన్నాల ‘బాక్’ వెనక్కి వెళ్ళింది.. ఆరోజే రిలీజ్ !

మమత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మమత చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగమే అయినా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పశ్చిమబెంగాల్‌లో ఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారా? లేదంటే మరేదైనా ఉందా? అనేది కాంగ్రెస్ స్పందన బట్టి తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Revanth Reddy: భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇస్తున్నా.. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత శుక్రవారమే జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో భారీగా పోలింగ్ నమోదైంది. 77శాతం ఓటింగ్ నమోదైంది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Bode Prasad: కూటమి విజయం కోసం ప్రజలు సంకల్పించారు..! ఇదే స్ఫూర్తి కొనసాగాలి