Mamata Benerjee: కేంద్ర సర్కార్‌పై దీదీ పాట.. నిధులు రిలీజ్ చేయడం లేదంటూ నిరసన గాత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Benerjee: రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావట్లేవంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల పాటు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తన గాత్రంతో ఆకట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు రిలీజ్ చేయడం లేదంటూ నిరసన గాత్రం వినిపించారు. బెంగాళీ భాషలో ఆమె పాట పాడారు. ధర్నాలో రెండో రోజు ఉదయం మమతా బెనర్జీ స్వయంగా పాట పాడడం గమనార్హం. ధర్నా చేస్తున్న వేదికపైనే తన నిరసన గాత్రాన్ని వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తమకు నిధులను విడుదల చేయడం లేదని మమత ఆరోపించారు. పనికి ఆహారపథకంతో పాటు అనేక పథకాలకు చెందిన నిధుల్ని కేంద్రం రిలీజ్ చేయడంలేదని ఆమె తెలిపారు.
Read Also: Viral Video: థియేటర్ యాజమాన్యం నిర్వాకం.. టికెట్ ఉందని ప్రాధేయపడినా.. వీడియో వైరల్
Also Read
ఇదిలా ఉండగా.. నిధుల గురించి ధర్నా చేపట్టిన సీఎం మమతా బెనర్జీ కొత్త రాగం అందుకున్నారు. బీజేపీని గద్దె దించటం కోసం కలసి పోరాడుదాం అంటూ తన వైఖరిని మార్చుకున్నారు. గతంలో తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని ప్రకటన చేసిన మమత.. దేశంలో తాజా పరిణామాలతో కొత్త పాట పాడుతున్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని మమత పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యం కావాలని పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో తాను దీక్ష చేస్తున్నానని, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదని మమతా బెనర్జీ వెల్లడించారు. ఇక నిరసన ప్రదర్శనకు అయ్యే ఖర్చును తమ పార్టీ భరిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా దీక్ష చేస్తానని తేల్చి చెప్పారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee sings a Bengali song on the second day of her Dharna in Kolkata, against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/r6CRXCuqty
— ANI (@ANI) March 30, 2023
తాజావార్తలు
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!