Mamata Benerjee: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, సాగర్దిఘి ఉపఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు. సాగర్దిఘి ఉప ఎన్నికలో తమ పార్టీ ఓటమికి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఏర్పడిన అనైతిక పొత్తు కారణమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాము ఏ ఇతర రాజకీయ పార్టీలతో కలసి వెళ్లబోమని, ప్రజల మద్దతుతో ఒంటరిగా పోరాడతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలలో పొత్తు పెట్టుకునే అవకాశాలపై మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు.
2024లో తృణమూల్ ప్రజలతో పొత్తుకు వెళ్తామని.. ఇతర రాజకీయ పార్టీలతో వెళ్లమన్నారు. ప్రజల మద్దతుతో ఒంటరి పోరాటం చేస్తామని, బీజేపీని ఓడించాలనుకునే వారు మాకు ఓటేస్తారని తాను నమ్ముతున్నట్లు మమత బెనర్జీ వెల్లడించారు. సాగర్దిఘి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం,త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం జరిగిన బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ, సీపీఐ(ఎం) లేదా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు బీజేపీకి ఓటు వేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.
Read Also: US Warns China: బీజింగ్ రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తే.. చైనాకు అమెరికా హెచ్చరిక
సాగర్దిఘి ఉపఎన్నికలో తమ పార్టీ ఓటమికి కాంగ్రెస్ బీజేపీతో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్న ‘అనైతిక పొత్తు’ కారణమని మమతా బెనర్జీ అన్నారు. ఆ ఉపఎన్నికలో మా ఓటమికి తాను ఎవరినీ నిందించనన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీల అనైతిక పొత్తును తీవ్రంగా ఖండిస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు.బీజేపీ ఓట్ల శాతాన్ని లెక్కిస్తే, ఈసారి వారు తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేశారు. కాబట్టి కాంగ్రెస్‌కు కాంగ్రెస్-సీపీఎం కలయికతో పాటు బీజేపీ ఓట్లను బదిలీ చేసిందని మమత బెనర్జీ ఆరోపించారు.